చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడి గ్రామంలో సర్పంచ్ భూపతి రెడ్డి మైసమ్మ ఆలయానికి గ్రామస్తులతో కలిసి గురువారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులతో ఈ మైసమ్మ ఆలయం పనులు చేపట్టానన్నా రు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలచందర్, మాజీ ఎంపీటీసీ రాకేష్,వార్డ్ మెంబర్ సునీల్ గోహార్కర్, మాజీ ఎంపీటీసీ గోపతి విటోభా,నందు గౌడ్, సిద్రప్ సుభాష్, కదరపు ప్రవీణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.