చిత్రం న్యూస్, భైంసా:నిర్మల్ జిల్లా భైంసాలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్ వాడీ టీచర్లు బుధవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కు వినతి పత్రాన్ని అందజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని కోరారు. తమకు బీఎల్ వో. డ్యూటీ లు వేయకుండా చూడాలన్నారు. బీఎల్ వో డ్యూటీ లు వేయడం మూలంగా వృత్తి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అదే విధంగా పలు సమస్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో టీచర్లు డి.అనసూయ, ఎ.సంధ్యారాణి, ఎన్.సంతోషి, జి.సంధ్య తదితరులు పాల్గొన్నారు

