Chitram news
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 6:55 am Editor : Chitram news

పిప్రి లిఫ్ట్ కు మహర్దశ 

*నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

* రూ.77 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వ జీ.వో.విడుదల 

చిత్రం న్యూస్, లోకేశ్వరం: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రైతాంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముథోల్ నియోజకవర్గం సస్యశ్యామలం కావాలన్నది ఆయన కల. అందులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ లకు నిధులు, చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని పలు మార్లు అసెంబ్లీ లో ప్రస్థావించడం తో పాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులను కలవడం, ముఖ్య మంత్రికి విన్నవించడంతో ఇక నియోజకవర్గానికి ఇరిగేషన్ లో నిధుల వరద ప్రారంభమైంది.. చెరువులు, లిఫ్ట్ ల పనులు ప్రారంభం కాగా పిప్రి లిఫ్ట్ కు రూ.77 కోట్ల నిధులు విడుదల చేస్తూ సర్కార్ జి. వో. విడుదల చేసింది.. పనులు పూర్తయితే లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగునీరు అందనుంది. జీ.వో. విడుదల పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఇంచార్జి మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.