నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు
చిత్రం న్యూస్, సిద్దిపేట: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తోడ్పడుతుందని సిద్ధిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్ గ్రామంలో ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని తెలిపారు. సాంకేతికతను వినియోగించి గ్రామాలను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామ సర్పంచ్ మాధవనేని భాను...