చిత్రం న్యూస్, అనంతపురం: కుందుర్పి మండలం తూముకుంటలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ ) మహాసభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి పాలెం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, తాలూకా కార్యదర్శి గోపాల్, సీనియర్ నాయకులు వై. గోపాల్, శివలింగప్ప, విరుపాక్షప్ప, మహేష్, రవి, మంజునాథ్, హనుమంత రాయుడు, గంగాధర, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కార్యదర్శిగా అంగిడి మంజన్న, మఠం సహాయ కార్యదర్శిగా జి.నాగభూషణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఘనంగా సన్మానించారు.