చిత్రం న్యూస్, హిందూపురం: హిందూపురం పట్టణ ప్రముఖులు బీ ఎస్.శ్రీధర్ స్వామి ఇటీవలే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, ఏఐసీసీ సభ్యులు కేటీ శ్రీధర్ శుక్రవారం హిందూపురం పట్టణంలోని మృతుని నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీధర్ స్వామి చిత్ర పటానికి పుష్పాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు బీఎస్టీ కంపెనీ బస్సులలో ఫ్రీ పాసులు అందిస్తూ వారికి ఉన్నతమైన చదవులకు చేయూతనిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు శ్రీధర్ స్వామియని కొనియాడారు.అలాంటి మహోన్నతమైన వ్యక్తి శివైక్యం పొందడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ బి.ఎస్ విద్యాసాగర్, అప్పుస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు తదితరులు ఉన్నారు.