చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ డ్యాం పైన జరుగుతున్న సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో బాలురు అండర్ 15 విభాగంలో భోరజ్ మండల కేంద్రానికి చెందిన కాళ్ళ గౌతం రెడ్డి ఇండివిజువల్ టైం ట్రావెల్ పోటీలో అదిలాబాద్ జిల్లా బెస్ట్ స్పాట్ పార్టిసిపెంట్ అవార్డు గెలుపొందారు. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన గౌతంరెడ్డి ఈ ఘనత దక్కించుకున్నాడు. భోరజ్ కు చెందిన గౌతం గత నాలుగేళ్ల నుండి సైక్లింగ్ లో సాధన చేస్తున్నాడు. వివిధ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో పాల్గొన్నాడు. తండ్రి సర్వేశ్వర్ రెడ్డి ప్రోత్సాహంతో సైక్లింగ్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు. కోచ్ పాండు జాదవ్ ఆధ్వర్యంలో ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధిస్తానన్న పట్టుదల తనకుందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.