*రెండు రోజులు నీటి సరఫరా నిలిపివేత
చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని సీతగొంది వద్ద NH 44 బ్లాక్ స్పాట్ ప్రాంతంలో ఉన్న మిషన్ భగీరథ 1000 mm MS పైప్లైన్ మార్పిడి పనుల కారణంగా, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ఫిబ్రవరి 24, 25 తేదీలలో నీటి సరఫరా ఉండదని, ఆదిలాబాద్ మునిసిపాలిటీతో పాటు ఆదిలాబాద్ గ్రామీణ, బేల, జైనథ్,మావల, తాంసి, భీంపూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాలు గ్రామ పంచాయతీలు సీతగొండి, గార్కంపేట్-1, మాచాపూర్, మల్కాపూర్, వైజాపూర్, కమలాపూర్ గ్రామాల్లోని దాదాపు 406 గ్రామీణ ఆవాసాలకు సరఫరా నిలిచిపోనుంది.పైప్లైన్ ఆధునీకరణ పనుల దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ మేరకు సంబంధిత MPDOలు, MPOలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు తమ పరిధిలోని గ్రామాల్లో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

