కామారెడ్డి ఎమ్మెల్యేపై దాడికి నిరసనగా జైనథ్లో రాస్తారోకో
చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని, బాన్సువాడలో చెలరేగిన అల్లర్లను నిరసిస్తూ సోమవారం బీజేపీ నాయకుల, కార్యకర్తలు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు గంటకు పైగా బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు లోక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక...