శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు
చిత్రం న్యూస్, ఖానాపూర్: బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బంజార నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బాసరలో గోదావరి నది తీరాన 45 రోజులపాటు దీక్షలో కొనసాగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బాసరలో 5 ఎకరాల విస్తీర్ణంలో సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది బాసరలో జరిగిన సేవాలాల్ జయంతి ఉత్సవాలలో సందర్భంగా మంత్రి సీతక్క, ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీ విధంగా బాసరలో 5 ఎకరాల భూమిని, గుడి నిర్మాణానికి రూ.5 కోట్లను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని కోరారు.

