చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 41వ వార్డు (సాయినగర్, టీచర్స్ కాలనీ), 40వ వార్డు (దస్నాపూర్), 10 వ వార్డు (రామ్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్తించారు. ఇంటింటికి తిరుగుతూ వార్డులలో అన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నా, పట్టణం అభివృద్ధి చెందాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకు గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డులు, సన్నబియ్యం లాంటివెన్నో అందిస్తుందన్నారు. చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆశీర్వదించి, గెలిపించాలని కోరారు. ఆయన వెంట కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.