చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని గ్రామంలో ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో హీరా సుఖ జయంతి సందర్భంగా ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు యాదవ్‌రావు కుర్సెంగే మాట్లాడుతూ.. హీరా సుఖ ఆశయాల కోసమే ఈ రోజు హీరా సుఖ కింగ్రి వాయిద్యాలతో జన చైతన్య కార్యక్రమాన్ని చేసి దేవుళ్ళను కాపాడి ఆదివాసీ సమాజానికి, సంక్షేమానికి కృషి చేశారనీ పేర్కొన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆదివాసీ దేవీ దేవతల ను ఆదివాసీ సమాజానికి బోద చేస్తూ సమాజానికి తన జీవనాన్ని అంకితం చేశారన్నారు. ఈ కార్యక్రమం లో ఆదివాసీ ప్రధాన్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోవా మనోహర్, ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మడావి శంకర్, యువ నాయకులు కినక సురేష్. గ్రామ పంచాయతీ సర్పంచ్ పెందూర్ ఇస్తారి, వెట్టి ఉతందాస్, ఉద్ధవ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

