చిత్రం న్యూస్ జైనథ్: జైనథ్ మండలం బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, ఉపసర్పంచ్ కడే రవి, వార్డు సభ్యులు, తహసీల్దార్ నారాయణ, మండల వ్యవసాయ అధికారిణి పూజ, జీపీవో సురేష్, పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, గ్రామస్తులు రాంరెడ్డి,బాజీరావ్ చంద్రకాంత్ రెడ్డి, దత్తు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.