చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని డేరాగ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో మొరం తరలిస్తున్న. 5టిప్పర్లను పట్టుకున్నట్లు బోథ్ ఎస్సై వి.పురుషోత్తం తెలిపారు. తమ సిబ్బంది సాయి కృష్ణ, శ్రీకాంత్, సుధాకర్ లతో కలిసి విశ్వసనీయ సమాచారం మేరకు దాడిచేసి పట్టుకకొని పోలీస్ స్టేషన్ తరలించామన్నారు. 5 టిప్పర్ల పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా మొరం, ఇసుక తరలిస్తే చట్టరిత్యాచర్య తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.