చిత్రం న్యూస్, బోథ్: బోథ్ మండలంలోని బోథ్ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పేద మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళా సాధికారతే లక్ష్యాంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బొడ్డు గంగారెడ్డి, బోథ్ ,మాజీ ఎంపీటీసీ చాట్ల ఉమేష్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, ఏపీఎం గంగాధర్, సీసీ సర్వేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.