చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో కొత్త ప్రవేశాలకు, అలాగే 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు షెడ్యూల్ విడుదలైంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడం ఈ పాఠశాలల లక్ష్యం.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 జనవరి 28
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28
హాల్ టిక్కెట్ల డౌన్లోడ్: 2026 ఏప్రిల్ 9 నుండి
ప్రవేశ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్ 19 (ఆదివారం)
దరఖాస్తు రుసుము: ఓపెన్ కేటగిరీ (OC) విద్యార్థులకు: ₹200/-
BC, SC, ST, PwD, EWS విద్యార్థులకు: ₹125/-
పరీక్ష వివరాలు: పరీక్ష ఆయా మండలాల్లోని మోడల్ స్కూల్స్/నిర్దేశించిన కేంద్రాలలో నిర్వహించబడుతుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు జరుగుతుంది.7 నుండి 10వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://tgms.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

