Chitram news
Newspaper Banner
Date of Publish : 27 January 2026, 4:37 pm Editor : Chitram news

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి:మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి మనోహర్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచులు తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్మ ఈడీ మనోహర్ అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ కార్యాలయంలో  సర్పంచులు,  ఉప సర్పంచులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ మండల అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.