Chitram news
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:32 pm Editor : Chitram news

పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి

చిత్రం న్యూస్ సాత్నాల: పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి ఉంటుందని ప్రముఖ వైద్యుడు ఎండీ జనరల్ మెడిసిన్, రిమ్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.కళ్లెం వెంకట్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం కాన్ఫ మేడిగూడ (ఆర్) పాఠశాలలో నిర్వహించిన 77వ  గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..తన జన్మదినం సందర్బంగా మేడిగూడ పాఠశాలను దత్తత తీసుకొని వంద మంది విద్యార్థులకు ఉచితంగా షూలు పంపిణీ చేశామన్నారు. భవిష్యత్తులో  ఏది అవసరమైన తాను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెప్పారు. డా.కళ్లెం వెంకట్ రెడ్డిని సర్పంచ్ పర్చకీ లక్ష్మీబాయి, వీడీసీ చైర్మన్ క్యాతం రాంరెడ్డి, స్కూల్  హెచ్ ఎం ప్రకాష్ యాదవ్ సన్మానం చేశారు.