Chitram news
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 12:37 pm Editor : Chitram news

చలో దిల్లీ విజయవంతం చేయండి-అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ 

 

చిత్రం న్యూస్, సాత్నాల: ఫిబ్రవరి 28న దిల్లీలో జరగనున్న లంబాడాల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి మహోత్సవాన్ని డా.బీ. ఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ వేదికగా ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు, లంబాడాలు తరలివచ్చి విజయవంతం. చేయాలని ఆయన పిలుపునిచ్చారు.