Chitram news
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 5:12 pm Editor : Chitram news

ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ లక్ష్యం – ఆడే గజేందర్

మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ సమక్షంలో భారీగా చేరికలు

చిత్రం న్యూస్, బోథ్: ప్రజలకు బాధ్యతాయుతమైన పాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు. మాజీ ఎంపీటీసీ చట్ల ఉమేష్ ఆధ్వర్యంలో 13వ వార్డు‌కు చెందిన సొలంకి సంతోష్, గిరిజబాయి, 14వ వార్డు‌కు చెందిన రాయల తిరుపతి, 16వ వార్డు‌కు చెందిన పద్మారావు, మాజీ వార్డు సభ్యులు సొలంకి తుకారాం, సిందేకర్ తాళ్ల శంకర్, మెర్గు శిందేకర్ నారాయణ, వెంకటరమణ, కొట్టూరి భాస్కర్, షేక్ నాజు తదితరులతో పాటు న్యూ కాలనీకి చెందిన దాదాపు 65 మంది వివిధ వర్గాల ప్రజలు, మాజీ వార్డు సభ్యులు, భారీ సంఖ్యలో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను రద్దు చేసి ప్రజలను మోసం చేసిందని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్, సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, మాజీ సర్పంచ్ నర్సింహ దాస్, ఆత్మ డైరెక్టర్ రహీం, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ మాల్యాల అంజయ్య, అందూర్ సర్పంచ్ పృథ్వి, మార్కెట్ డైరెక్టర్ అబుద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్, కాంగ్రెస్ నాయకులు ఆలపాటి అచ్యుతానంద్ రెడ్డి, ఉమేష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.