ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న లోక ప్రవీణ్ రెడ్డి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పూజ బాపు దంపతులు ఆదివారం గృహప్రవేశం పూజా కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అతనితోపాటు భుక్తాపూర్ వార్డు కాంగ్రెస్ నాయకుడు రోహిత్ షిండే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షేక్ అన్వర్, అంజాద్ ఖాన్, షేక్ రహీఫ్ అహ్మద్, షేక్ హైదర్ అహ్మద్, షేక్ అర్బజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.