Chitram news
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 4:21 pm Editor : Chitram news

వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్

చిత్రం న్యూస్, హైదరాబాద్: మీరు బ్యాంక్ పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఈ వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. జనవరి 24 నుంచి జనవరి 27 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

సెలవుల వివరాలు ఇవే: జనవరి 24 (శనివారం): నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. 25 (ఆదివారం): సాధారణ సెలవు దినం. 26 (సోమవారం): గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) సందర్భంగా జాతీయ సెలవు. 27 (మంగళవారం) వివిధ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వరుస సెలవుల కారణంగా నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్ లావాదేవీలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కస్టమర్లు తమ అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు UPI సేవలను వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.