*108 కళాకారులతో సామూహిక వీణ వాయిద్యం
*బాసర అమ్మవారికి “కళార్చన”
చిత్రం న్యూస్, బాసర :భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ క్షేత్రంలో శుక్రవారం అమ్మవారి పుట్టినరోజు శుభ సందర్భంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పోతరాజు జయలక్ష్మి త్యాగరాజ మ్యూజిక్ కళాశాల శ్రీ భక్తరామదాస్ మ్యూజిక్ కళాశాలలో ప్రముఖ వీణా అధ్యాపకురాలిగా సేవలందిస్తూ, తమ సంగీత సాధనతో అనేక మంది ప్రతిభావంతమైన శిష్యులను తీర్చిదిద్దారు. వీణా విద్యలో వారికి ఉన్న అపారమైన అనుభవం, నిబద్ధత, అంకితభావం వల్ల ఎంతో మంది శిష్యులు నేడు వీణా విద్వాంసులుగా ఎదిగి సంగీత లోకంలో తమ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అటువంటి విశిష్ట కళాకారిణి అయిన జయలక్ష్మి ఎన్నో ప్రతిష్టాత్మక వీణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, అనేక పురస్కారాలు, ప్రముఖుల మన్ననలు, ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వసంత పంచమి సందర్భముగా బాసర క్షేత్రంలో వారి శిష్యబృందం చేత అమ్మవారికి అంకితంగా “కచ్చపి అష్టోత్రర వీణా స్వరార్చన”ను ఇది భక్తి, సంగీతం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచే దివ్యమైన కార్యక్రమంగా ఒకేసారి సామూహికంగా 108 మంది కళాకారులు తమ వీణ వైద్యంతో కళామ తల్లి శ్రీ జ్ఞాన సరస్వతికి కళశాల రూపంలో సమర్పించారు. కార్యక్రమాన్ని చూసిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. అపూర్వమైన వీణానాదాన్ని ఆస్వాదించి భక్తులు చూస్తూ సాక్షాత్తు సరస్వతి దేవి వీణ వాయిస్తున్నట్టుగా అమ్మవారి రూపంలో కళాకారులు కనబడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారిని అంజనీదేవి, ఏఈఓ సుదర్శన్ గౌడ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు