మత్స్యరంగం యువతకు ఉపాధి కల్పనలో కీలకం – ఎమ్మెల్యే పాయల్ శంకర్
సాత్నాల ప్రాజెక్టులో రొయ్య పిల్లల విడుదల చిత్రం న్యూస్, సాత్నాల: మత్స్య రంగం గ్రామీణ యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలను కల్పించే రంగమని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సాత్నాల ప్రాజెక్టులో రూ.3 లక్షల విలువైన రొయ్య పిల్లల (రొయ్య సీడ్) విడుదల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రొయ్య పిల్లలను నీటిలోకి విడుదల చేసి, స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. సాంకేతికతతో మత్స్యాభివృద్ధి: ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పరిమితంగా...