ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
చిత్రం న్యూస్, సొనాల: సొనాల మండలంలోని సంపత్ నాయక్ తండా గ్రామంలో దేశీదారు సీసాలను అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పట్టుకొని కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ Md. జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాథోడ్ పూల్ సింగ్ , రాథోడ్ సంజు అనే ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకు చెందిన దేశీదారు బాటిల్స్ అమ్ముతూ పట్టుబడ్డారు. ఇద్దరు వ్యక్తుల దగ్గర మొత్తం 130 (90ml) బాటిల్స్ లభించాయి. ఈ దాడులలో ట్రైనీ సబ్ ఇన్ స్పెక్టర్ వి.శ్రీనివాస్, సిబ్బంది కార్తీక్ , సంధ్యారాణి, మయూరి, అరుణ, మంజుల పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి, బెల్లం, పటిక, దేశీదారు, గుడుంబా కలిగి ఉన్న, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.