ప్రాణాన్ని రక్షించిన హోం గార్డులను అభినదించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలో విధులు నిర్భహిస్తున్న హోగార్డులు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి పలువురుకి ఆదర్శంగా నిలిచారు. వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు మంచిర్యాల జిల్లాకు చెందిన సిద్ధం తిరుపతి ఆలయ క్యూ లైన్‌లో నిలబడి ఉండగా, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన అక్కడ విధుల్లో ఉన్న హోమ్ గార్డులు ఇంద్రకరణ్ రెడ్డి, గణేష్, నారాయణలు గమనించివెంటనే అప్రమత్తమయ్యారు.తక్షణమే CPR (Cardio Pulmonary Resuscitation) నిర్వహించి ప్రథమ చికిత్స అందించారు. వారి సకాలిక చర్యల వల్ల భక్తుడి ప్రాణాలు నిలిచాయి. తర్వాత అతనిని తక్షణమే వైద్య సిబ్బందికి అప్పగించి, సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా హోంగార్డుల ధైర్యసాహసాలు, మానవీయత, బాధ్యతాయుతమైన విధుల నిర్వహణ ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అధికారులు, అభినందించారు.