చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఓల్లఫ్ వార్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మొదటి సారి జరిగిన గ్రామ సభలో గ్రామస్థులు పలు సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకొచ్చారు. బేల గ్రామంలో ప్రభుత్వ స్థలాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించుకున్నారని సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామంలో విచ్చలవిడిగా ఏర్పడిన బెల్టు షాప్ ల వల్ల యువత చెడు మార్గంలో పయనిస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రంథాలయంలో మౌళిక సదుపాయాలు కల్పించాలని, యువతీ,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రోడ్లపైన తిరుగుతున్న పశువులను అరికట్టాలని కోరారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామ సభలో సంబంధిత అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలని కోరారు. ఈ సందర్బంగా సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్థులు పలు సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారన్నారు.ప్రతి సమస్యను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రామ సభలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనేలా చూస్తామన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను కూడా వెలికితిస్తామన్నారు.

