చిత్రం న్యూస్, భోరజ్: సర్పంచుల సంఘం భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల ప్రద్యుమ్న ( సన్నీ), మండల ప్రధాన కార్యదర్శిగా నోముల సంతోష్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సర్పంచులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.