చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉద్యోగులు సంఘటితంగా ఉంటూ హక్కుల సాధన కోసం పాటుపడాలని టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఏ. నవీన్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం అన్నారు. బుధవారం ఆదిలాబాద్ లోని బజరంగ్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫోరం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ లోని ప్రతి పంచాయతీ కార్యదర్శి టీఎన్జీవో సభ్యత్వం తీసుకొని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరంలో విలీనం చేశారు. అనంతరం జిల్లా ఫోరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా జె.సంజీవరావు, కార్యదర్శిగా కె.అరుణ్ రెడ్డి, కోశాధికారి అనిల్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు డి నాగభూషణ్, ఈ రామదాస్, బి. వినోద్ , ట్రెజరర్ అనిల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్ జాయింట్ , సెక్రెటరీ గంగన్న, ఉమెన్ జాయింట్ సెక్రెటరీ నస్సేమ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సత్యనారాయణ తో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఎటువంటి సమస్య వచ్చిన టిఎన్జీవోస్ అండగా ఉంటుందని ఏ.నవీన్ కుమార్ తెలిపారు. టీఎన్జీవో యూనియన్ లో పంచాయతీ కార్యదర్శులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పించారు. ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఎన్నికైన నూతన కార్యవర్గం (03) సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్,సునీల్ రెడ్డి,రాఘవేంద్ర, దుర్గయ్య,నాగభూషణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.