Chitram news
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 8:53 am Editor : Chitram news

పాఠశాలలో నీటి కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

కూర గ్రామంలో పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోర్ వేయించిన నేతలు

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం కూర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పాఠశాలలో విద్యార్థులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన బీజేపీ నాయకులు ఈ సమస్యను ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల ప్రాంగణంలో బోర్ వేయించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ..విద్యార్థుల సౌకర్యార్థం తక్షణమే స్పందించి బోర్ వేయించినందుకు ఎమ్మెల్యే శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగు రాకేష్ రెడ్డి, సిడం రాకేష్, బోగి ఉషన్న, పంచాయతీ కార్యదర్శి నర్సింలు, ఉపాధ్యాయులు నాగరాజు, శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.తమ సమస్యను గుర్తించి పరిష్కరించినందుకు పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.