చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రతి రోజు కక్షిదారులు, కేసులు, తీర్పులు తదితర అంశాలతో నిత్యం బిజీగా ఉండే న్యాయవాదులు క్రీడలతో మానసికోల్లాసం పొందుతారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల క్రీడలను క్యారం ఆడి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు లక్ష్మీకుమారి, తేజస్విని, దివ్యవాణి, రాజ్యలక్ష్మి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్, న్యాయవాదులు లోక ప్రవీణ్ రెడ్డి, కేమ శ్రీకాంత్, గ్రహేష్ తదితరులు పాల్గొన్నారు.
