Chitram news
Newspaper Banner
Date of Publish : 19 January 2026, 2:56 pm Editor : Chitram news

సదల్‌పూర్‌ ఆలయంలో మాజీ మంత్రి జోగు రామన్న పూజలు

చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పాలకుల వల్ల అన్ని వర్గాల ప్రజలు, రైతులు పరేషాన్ లో ఉన్నారని వారిని ఆ భగవంతుడే కాపాడాలని వేడుకున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బేల మండలం సదల్పూర్ లోని అతి ప్రాచీన శ్రీ బైరందేవ్, మహాదేవ్ జంగి జాతర సందర్భంగా సోమవారం ఆయన దేవుళ్ళను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. బేల మండలం అభివృద్ధికి, సదల్‌పూర్‌ ఆలయ అభివృద్ధికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికి తెలుసన్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పాలనతో ప్రజలకు విముక్తి కల్పించాలని ఆ బైరం దేవ్, మహాదేవ్ లను వేడుకునట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రమోద్ రెడ్డి, దేవన్న ఓల్లప్వార్, సతీష్ పవార్, విపిన్ ఖోడే, ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యాంరావు, అరుణ్ కొడప, గ్రామ సర్పంచ్ మంగేష్ మర్సుకోల, నందు సిడం, మహదవ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.