Chitram news
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 4:57 pm Editor : Chitram news

ముంబై సాహిత్య సమ్మేళనం ముంబైలో సుకుమార్ పేట్కులే కి ఘన సన్మానం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కి నవి ముంబైలోని పన్వెల్లో ఆదివారం జరిగిన సాహిత్య సమ్మేళనంలో ఘనంగా సత్కరించారు. కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్ పన్వెల్ (నవీ ముంబై) మరియు పంచశీల్ తరుణ్ మండల్ సావర్గం (ముంబై) లు సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమ్మేళన, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన సాహిత్యం తెలుగు, మరాఠి, హిందీ భాషల్లో అనువాద రచనలు  చేస్తూ సాహిత్య సామాజికసేవ చేస్తున్నందుకు గుర్తింపుగా సుకుమార్ పేట్కులే ను ఘనంగా సత్కరించారు. ఆయనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ హిందీ, మరాఠీ, ఉర్దూ బహుభాషా కవి మధుబావల్కర్ ను సహితం కార్యక్రమ నిర్వాహకులు మెమెంటో, శాలువా, పూలమాల, బొకే, బహుజన సాహిత్యాన్ని బహూకరించి ఘనంగా సన్మానించారు. నవి ముంబై కి పన్వెల్ చెందిన కార్యక్రమ నిర్వాహకులు నాగనాథ్ డోలారే రచించిన రెండు మరాఠీ కవిత సంపుటులు మానవతే చే సింహాసన్, లావణ్యా లేని అనే పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ అవార్డును మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ తదితరులు ప్రధానం చేయగా పూణేకి చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్ తో పాటు మొత్తం 14 మందిని ఎంపిక చేసి ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన మహనీయుల ఆశయ సాధన కోసం గత 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నందుకు గాను తనకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ద్వారా గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాగే సాహిత్య సామాజిక క్షేత్రంలో  మున్ముందు పనిచేయడానికి ఈ సన్మానం దోహద పడుతుందని ఆయన తెలిపారు.