చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ మండలం గిమ్మ గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న విన్నవించారు. శుక్రవారం తెలంగాణ-మహారాష్ట్ర నడుమ పెన్గంగా నదిపై నిర్మించిన చనాఖా-కొరటా బ్యారేజి హత్తిఘాట్ పుంపుహౌస్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి సర్పంచ్ ప్రద్యుమ్న సమస్యలపై విన్నవించారు. గిమ్మ గ్రామంలో 400 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్ర నారాయణ స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, ఆలయ పునరనిర్మాణానికై నిధులు మంజూరు చేయాలని, పెన్ గంగా తీరంలోని ఓంకారేశ్వరాలయం అభివృద్ధికి కృషిచేయాలని విన్నవించారు. అర్హత కలిగిన.కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని విన్నవించారు. గిమ్మ నుంచి మాండగడ, పిప్పర్వాడ వరకు రోడ్డు, వంతెన నిర్మాణం చేపట్టాలని వివరించారు. ఇది వరకు నిర్మించిన డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు.
