Chitram news
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 9:12 pm Editor : Chitram news

వరుస దొంగతనాల కేసును చేధించిన బేల పోలీసులు

*అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

*వివరాలను వెల్లడిస్తున్న బేల ఎస్సై ఎల్ ప్రవీణ్ కుమార్

చిత్రం న్యూస్, బేల: బేల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస దొంగతనాల కేసును బేల పోలీసులు చేధించారు. శనివారం నిందితుడి వివరాలను బేల ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. అభి అలియాస్ కుంచెలవార్ అభినవ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బేల గ్రామంలో ఫర్టిలైజర్ షాపులు, బ్యాంక్, ఇతర దుకాణాల షట్టర్లు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డానని తెలిపారు. దొంగతనం చేసిన నగదును చేనులో దాచి పెట్టాడన్నారు.దొంగతనానికి ఉపయోగించిన గడ్డపార,దుస్తులు, మొబైల్ ఫోన్,  మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దొంగలించబడిన నగదు లెక్కించగా మొత్తం రూ.58 వేలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.