చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడిలో ఆ గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు. సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ తో పాటు సభ్యలను సన్మానించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్బంగా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చిప్ప రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా పాలకవర్గ సభ్యులందరు కలిసి కట్టుగా పని చేయాలని కోరారు.గ్రామంలో గల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్బంగా కోరారు.ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం, మురుగు కాలువల నిర్వహణ చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
