Scientist చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా సీతగొంది మండలం మల్కాపూర్ గ్రామంలో వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో కంది పంట పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా.కె. రాజశేఖర్, డా.డి మోహన్ దాస్లు మాట్లాడుతూ..కంది రకం ‘WRGE-97’ ను రాబోయే కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ విత్తనాలను వాడుకోవాలని సూచించారు. ఈ కంది రకం తక్కువ కాల పరిమితి కలిగి, ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం చేపడుతున్న ” నాణ్యమైన విత్తనం- రైతన్నలు నేస్తం”(Quality seed at every village) కార్యక్రమంలో భాగమన్నారు. Aeo శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.
