చిత్రం న్యూస్,బేల:ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో అతిపురాతనమైన బైరందేవ్,మహాదేవ్ ఆలయంలో మంగళవారం నుండి జంగి జాతర ప్రారంభమైంది.కోరంగే వంశస్థులు, గ్రామ సర్పంచ్ దంపతులు గిరిజన సంప్రదాయం ప్రకారం డప్పుచప్పులు,భజనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాదేవ్,భైరందేవ్ విగ్రహాలకు ప్రత్యేక పూలతో అభిషేకం చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరంగే సోనేరావ్ మాట్లాడుతూ బేల మండలంలోని సదల్ పూర్ బైరందేవ్,మహాదేవ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహాదేవ్ ఆలయంలో కొలువైఉన్న శివలింగానికి భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరతాయని ప్రఘాడ విశ్వాసంగా నమ్ముతారని పేర్కొన్నారు.జాతర వచ్చే భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.ఈ ఆలయానికి చుట్టు పక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ నుండి భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. శ్రీ మహాదేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా భక్త జనులపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కొరంగే వంశస్థుల కోరుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బైరందేవ్,మహాదేవ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్యామ్ రావ్,సర్పంచ్ మర్సకోలా మంగేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

