శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయంలో శ్రీ సదలేశ్వర్ పుస్తక ఆవిష్కరణ
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చిందం ఆశన్న రచించిన శ్రీ సదలేశ్వర పుస్తక ఆవిష్కరణను ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యామ్ రావ్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆశన్న శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర విశిష్ట గురించి తన సువర్ణ అక్షరాలతో చాలా చక్కగా రాశారని ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.ఈ సందర్బంగా చిందం ఆశన్న మాట్లాడుతూ. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయంలో శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయం ఒకటి అని అన్నారు.శ్రీ సదలేశ్వర పుస్తకం తన మనవడికి అకింతం చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ పుస్తకంలో ముఖ్యంగా గొండ్వాన చరిత్ర, స్వయంబుగా వెలసిన ఆ పరమేశ్వరని విశిష్ట, కాలభైరవుని విగ్రహం గురించి రచించడం జరిగిందన్నారు.
