చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హస్నాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా జై సేవాలాల్, జై కుమురంభీం యూత్ క్రీడామండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ముగింపు పోటీలు ముగింపుకు చేరాయి. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు, అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ పవార్ మాట్లాడుతూ..మండలంలో కబడ్డి, క్రికెట్ పోటీలు నిర్వహించినా తనవంతు సహకారం అందించామన్నారు. రానున్న రోజుల్లో మా సహాయ సహకారాలు ఎప్పుడైనా అందిస్తామన్నారు.గెలుపొందిన జట్టును అభినందించారు. మొదటి బహుమతి 21 వేలు మంగేష్ సర్పంచ్, నాయక్ లింబాజీ ఆధ్వర్యంలో, రెండో బహుమతి 15 వేలు అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, 10 వేలు, అరుణ్ కొడప మాజీ ఎంపీటీసీ రూ.5వేలు , మూడో బహుమతి 7 వేలు, నాలుగో బహుమతి రూ.5,555 అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగేష్ మరస్కోలే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప,పోహార్ సర్పంచ్ జంగు, గ్రామ నాయక్ లింబాజీ,మాజీ ఉప సర్పంచ్లు మహదవ్ ,సంజయ్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
