చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన యువ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జై హనుమాన్ యూత్ కు క్రికెట్ కిట్ అందజేసి ఉదారత చాటారు. జిమ్మ శేఖర్ అతి చిన్న వయసులోనే ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు యువతను క్రీడలలో ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఈ యువ నాయకుడు, యువతలో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యశీలతను పెంపొందించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తూ ఇటీవల గ్రామ యువకులకు క్రీడా సామగ్రి (బాల్స్, కిట్లు, జెర్సీలు) అందజేశారు. యువతే గ్రామ భవిష్యత్తు. వాళ్లను శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దడం నా బాధ్యత అని జిమ్మ శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు సామ శ్రీపాల్ రెడ్డి, గోహార్ కార్ సూరజ్, గోహర్ కర్ సచిన్, రాహుల్, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, అభి గన్నే, గుమ్మడి రాహుల్, సుంకరి గజానన్, పు రుషోత్తం, జైమని,వేదాంత్ రెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
