చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, గ్రామ యువకులు స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, నేటి యువకులకు స్పూర్తి ప్రదాత మహానుభావుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి లింగారెడ్డి, జైనథ్ గ్రామ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, సత్యనారాయణ, ప్రతాప్ యాదవ్, అన్నెల అశోక్, రమేష్ యాదవ్ గ్రామ యువకులు సాయి, ప్రవీణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
