Chitram news
Newspaper Banner
Date of Publish : 12 January 2026, 10:28 am Editor : Chitram news

నేడు బేలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని 353బీ జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన టవర్లపై విద్యుత్తు తీగలు ఎక్కించే పనులు కొనసాగుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సంతోష్ తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.