అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డి ఏకగ్రీవం
చిత్రం న్యూస్, శంకరపట్నం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ స్వయంభూ సమ్మక్క-సారలమ్మ జాతర ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతర గుట్ట వద్ద నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి వెన్నంపల్లి, ఎక్లాస్‌పూర్, గర్రెపల్లి, లస్మన్నపల్లి, ఆరెపల్లి, సోమారం గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అభివృద్ధిని కాంక్షించి, అందరి ఆమోదంతో నూతన అధ్యక్షుడిగా సారబుడ్ల సమ్మిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆరు గ్రామాల పెద్దలు వెల్లడించారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈ నూతన కార్యవర్గం కృషి చేయనుందని తెలిపారు. నూతన అధ్యక్షుడుగా సారబుడ్ల సమ్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా మారుపాక తిరుపతి (వెన్నంపల్లి), కనకం అజయ్ (వెన్నంపల్లి), కోశాధికారిగా సంగాల తిరుపతి (వెన్నంపల్లి), ఉపాధ్యక్షులుగా గుర్రాల మహేందర్ రెడ్డి (లస్మన్నపల్లి), బొద్దుల తిరుపతి (ఆరెపల్లి), ఇల్లందుల సంపత్ (ఎక్లాస్‌పూర్), దోకిడి తిరుపతి (గర్రెపల్లి), పడాల తిరుపతి (సోమారం), బీస నర్సయ్య (వెన్నంపల్లి), సహాయ కార్యదర్శులుగా సంగాల రవికుమార్, మొలుగూరి సంపత్ (వెన్నంపల్లి), తిప్పిరిశెట్టి రమేష్ (గర్రెపల్లి), కస్తూరి రాములు (ఆరెపల్లి), తీగల రఘుపతి గౌడ్, (ఎక్లాస్‌పూర్), మెరుగు నరేష్ (లస్మన్నపల్లి), గుంటి వెంకటేష్ (సోమారం) కార్యవర్గ సభ్యులుగా తిప్పిరిశెట్టి రమేష్, బెల్లి తిరుపతి (గర్రెపల్లి), బైరి రాజు, తలారి యాదగిరి (లస్మన్నపల్లి), బండి రమేష్, రేగుల భిక్షపతి (వెన్నంపల్లి), మేక కుమార్, కచ్చు శ్రీనివాస్ (సోమారం), గొంగళ్ళ రవి, కోలె అశోక్ (ఆరెపల్లి), గంగిళ్ళ రాంరెడ్డి, చల్లూరి రవి (ఎక్లాస్‌పూర్). మహ్మద్ రహీమ్ పాషా (వెన్నంపల్లి), బీస వెంకటేష్ (వెన్నంపల్లి), మొలుగూరి వెంకటయ్య (వెన్నంపల్లి), మొలుగూరి అయిలయ్య (వెన్నంపల్లి), మారుపాక ప్రణయ్ (వెన్నంపల్లి) వెన్నంపల్లి బండ శివానంద రెడ్డి నియామకం అయ్యారు.

