*మద్దతు పలికిన న్యాయవాదులు, మేధావులు, నాయకులు
*తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందించిన రైతులు
చిత్రం న్యూస్, కడెం: కొత్త సదర్ మాట్ ఆనకట్ట నుండి పాత సదర్ మాట్ ఆనకట్ట వరకు ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టాలని, చివరి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరుతూ శనివారం కడెం మండల కేంద్రంలో సదర్ మాట్ కాలువ సాధన సమితి అధ్యక్షుడు రాజేందర్ హపావత్ ఆధ్వర్యంలో సదర్ మాట్ ప్రత్యేక కాలువ సాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మండలంలోని కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పెద్దూర్, తండా, బెల్లాల,దిల్దార్ నగర్,ఎలగడప,లింగాపూర్, లక్ష్మి సాగర్ నచ్చన్ ఎల్లాపూర్ తదితర గ్రామాల నుండి వందలాది మంది రైతులు స్వచ్చందంగా తరలి వచ్చారు. ఖానాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, న్యాయ వాదులతో పాటు మేధావులు, ఉద్యమకారులు, పలు గ్రామాలకు చెందిన రైతులు, రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులు పట్టించుకోకపోవడం లేదని తెలంగాణ తల్లికి వినతి పత్రాన్ని అందజేశారు దీక్షలో సర్పంచులు విజయ్ కుమార్, స్టీఫెన్, రామాగౌడ్, చిట్టిటె ముత్తన్న, దండికి గంగన్న, లసేట్టి శేఖర్, జాగిరి శ్రీనివాస్,ముక్కెర శ్రీనివాస్,దశరథ్,కానూరి సతీష్,నవీన్,గద్దల దేవన్న, సదానందం,పల్లె సత్తన్న, నర్సింహా రెడ్డి,నారయణ, శంకర్,రాజేశ్వర్, రాజేందర్,బుక్య శేఖర్, వకీలు గంగన్న, సునారికారి రాజేష్, లింగన్న, రాజాగౌడ్, నాగరాజు, ప్రశాంత్,సందిప్, ఆది మల్లేష్, ప్రవీణ్, సురేష్ నాయక్, రాపర్తి శ్రీనివాస్,బాలు నాయక్, సత్యారావు, దాసరి రమణ, చిన్నరాజన్న, రాములు,భూమన్న, దుర్గం లక్ష్మి,ఆకుల లక్ష్మి,రాజన్న,మక్కి శంకర్, గిల్లి రమేష్,రాములు తదితరులు పాల్గొన్నారు.
