గృహజ్యోతి పథకం: జీరో బిల్లు రాని వారికి ప్రభుత్వం కొత్త ఆప్షన్
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'గృహజ్యోతి' పథకంలో భాగంగా అర్హులైనప్పటికీ జీరో (0) బిల్లు రాని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద జీరో (0) కరెంట్ బిల్లు రాని వారు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. జీరో బిల్లు రాని అర్హులైన వినియోగదారులు తమ మండలంలోని MPDO కార్యాలయం వద్దకు లేదా...