ఎస్సీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్ ప్రద్యుమ్న
చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ ఎస్సీ హాస్టల్ ను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ తిరుగుతూ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కప్పుకునేందుకు దుప్పట్లు ఉన్నాయా..విద్యార్థులు ఎంత మంది ఉన్నారంటూ ఆరా తీశారు. మీరు చక్కగా చదువుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని పరిష్కరిస్తానన్నారు. ఆయన వెంట...