Chitram news
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 2:29 pm Editor : Chitram news

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం_ఎంపీడీవో వెంకట్ రాజు

చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని  సాత్నాల ఎంపీడీవో వెంకట్ రాజు, తహసీల్దార్ జాదవ్ రామారావు అన్నారు.  మండలంలోని కాన్ప మేడిగూడ (ఆర్) గ్రామంలోని రైతువేదికలో  గురువారం సమావేశం ఏర్పాటు చేసి సర్పంచులను ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఆ దిశగా కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో  ఏవో రాథోడ్ కైలాష్, ఏపీఎం సుజాత తదితరులు పాల్గొన్నారు.