Chitram news
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 7:00 pm Editor : Chitram news

జాతీయ రోడ్డు భద్రత..ప్రతి ఒక్కరి బాధ్యత

చిత్రం న్యూస్,ఆదిలాబాద్.జాతీయ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ పని చేస్తోందని ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గుండా రామ స్వామి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా స్థానిక జిల్లా న్యాయం సదనంలో మంగళవారం ఆటో, లారీ, ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతా నియమాలు పాటించాలని తెలుపుతూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రామస్వామి మాట్లాడుతూ.. లైట్‌ మోటార్‌ వెహికల్‌ నడిపే వాహనదారులు డ్రైవింగ్‌ సీట్‌ బెల్ట్‌ తప్పకుండా ధరించాలని, సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు  ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ఈ అవగాహన సదస్సులో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌసిల్ దాసరి గంగారం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు డోలె తదితరులు పాల్గొన్నారు.