విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి_ డా.సర్ఫరాజ్
* కోలాం ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం చిత్రం న్యూస్, ఆదిలాబాద్ రూరల్: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని డా.సర్ఫరాజ్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలము అంకోలి కోలాం ఆశ్రమ పాఠశాలలో ప్రతి నెల మాదిరిగానే శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు జలుబు, దగ్గు, గోకడం లాంటి లక్షణాలు కల్గిన 23 మంది పిల్లలను గుర్తించామని, వారికి పరీక్షలు జరిపి ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి పర్యవేక్షణలో మందులు అందజేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత...